అవినీతికి కేరాఫ్‌ అ‌డ్రస్‌గా మారిన వ్యవసాయ శాఖ ఏడి మంగిలాల్‌

Adi Mangilal of the Department of Agriculture, who has become a carafe address to corruption

‌హైదరాబాద్‌ (‌చట్టం) : అతను వ్యవసాయ శాఖలో కీలక పదవిలో కొనసాగుతున్న అధికారి. ఆ పదవిని అడ్డు పెట్టుకొని అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ అవినీతికి కేరాఫ్‌ అ‌డ్రస్‌గా నిలిచాడు ఆయన ఎవరో కాదు పోలీసులు అరెస్టు చేసిన వ్యవసాయ శాఖ ఏడీ మంగీలాల్‌. ఈయన చరిత్రను పరిశీలిస్తే అంత అవినీతి మయమే. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లా ఏటూరు నాగారం ఐటీడిఏలో రూ.1.50 కోట్ల నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

2009-10, 2010-11 సం।।లో భైంసా ఏడిఏగా విధులు నిర్వహిస్తున్న సమయంలో 5.50కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. ఇక ప్రకృతి వైపరిత్యాలు వచ్చి రైతులు నష్టపోగా వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం విడుదల చేసిన నిధులను దారి మళ్లించి తన ఖాతాలో జమ చేసుకున్నాడు. మంగిలాల్‌కు వ్యవసాయ శాఖ కమీషనర్‌ ‌కార్యాలయం నుండి పూర్తి అండదండలు ఉండడంతో ఈ తతంగాలను నడిపినట్లు తెలుస్తోంది.

అంతే కాకుండా వ్యవసాయ శాఖ కమీషనర్‌గా జగన్మోహన్‌ ‌బాధ్యతలు స్వీకరించిన తర్వాత మంగిలాల్‌ అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. అదే క్రమంలో మంగీలాల్‌ 8‌కిలకమైన పదవులు కట్టబెట్టారు. కమీషనరేట్‌లో ఉన్నతాదికారులు, కీలక విభాగంలో పనిచేసేవారికి లంచాలు ఇస్తూ కీలక పదవులు తీసుకున్నారు. ఆత్మ నిదులు కూడా 1.50 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కిసాన్‌ ‌మేళా పేరుతో 15లక్షలు మంగీలాల్‌ ‌ఖాతాలో మళ్లించుకున్నట్లు ఫిర్యాదు వచ్చాయి.

రైతులకు శిక్షణలు, భూసార పరీక్షలకు వచ్చిన నిధులు ఒకసారి 20 లక్షలు, మరోసారి 88లక్షలు, ఆర్గానిక్‌ ఔట్‌లెట్ల పేరుతో 20లక్షలను సైతం దారి మళ్లించినట్లు సమాచారం. 2017-19 మధ్యకాలంలో 3కోట్లు దుర్వినియోగానికి పాల్పడ్డాడు. పత్తి పంటకు గులాబీ రంగు పురుగు ఆశించకుండా రక్షించుకునేందుకు రైతులకు టీఎస్‌ ‌మార్క్‌ఫెడ్‌ ‌ద్వారా పంపిణి చేయాల్సిన లింగాకర్షక బుట్టల పంపిణీ పథకం పూర్తిగా దుర్వినియోగం అయింది.

16.76 లక్షల యూనిట్లు నోడల్‌ ఏజెన్సీ అయిన మార్క్‌ఫెడ్‌ ‌ద్వారా చేయాల్సి ఉండగా 8లక్షల యూనిట్లు అసలు ఇవ్వలేదు. ఇవి రైతులకు పంపిణి చేసినట్లు ఆధారాలు, యూసీలు లేవు. సమర్పించిన మరో యూసీలలో 8.76 లక్షల యూనిట్లలో దాదాపు ఫోర్జరీ సంతకాలే ఉన్నాయి. 2019-20 సం।।లో ఈ పథకానికి 6.54 కోట్లు మంజూరు చేశారు. కియా బయోటెక్‌ ‌కంపెనీకి ఎలాంటి టెండర్లు లేకుండా నామినేషన్‌ ‌పద్దతిలో కాంట్రాక్లును అప్పగించి దాని ద్వారా లబ్ది పొందారు. ఖమ్మం జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేకు స్వయాన సోదరుడు కావడం గమనార్హం.

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More