ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు : ఫిజికల్ డైరెక్టర్ గుండెల్లి రాజయ్య

International Yoga Day Celebrations

చట్టం భూపాలపల్లి ప్రతినిధి : ప్రభుత్వం ఆదేశానుసారం  జడ్పీహెచ్ఎస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుల్లపల్లి పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు పాఠశాల ఇంచార్జి ఉపాధ్యాయురాలు భాగ్యశ్రీ, వ్యాయమ ఉపాధ్యాయులు గుండెల్లి రాజయ్య ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గుండెల్లి రాజయ్య మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి ఎంతగానో తోడ్పడుతుందని, యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని జీవన ప్రమాణాలు మెరుగు అవుతాయని తెలియజేశారు.

యోగ అనగా శరీరాన్ని, ఆత్మను ఐక్యము చేయడమునే యోగ అంటారు భారతీయ సాంస్కృతిలో వ్యాయామం మిళితమై ఉన్నది. యోగాలో ఆసనాలు, సూర్య నమస్కారాలు, ప్రాణాయామం మొదలగునవి ఉంటాయి.
ఈరోజు అనగా జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ఎందుకు జరుపుకుంటారు అనగా ఉత్తరార్థ భాగంలో పగలు పొడవైన రోజుగా గుర్తించినారు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐక్యరాజ్యసమితిలో జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా ప్రతిపాదించగా అన్ని దేశాలు ఏకకంఠంతో తీర్మానించాయి, భారత సాంస్కృతి సాంప్రదాయాలలో జూన్ 21న సద్గురువులైన పెద్దలకు నివాళులు అర్పించే రోజు అందుకే ఈరోజును యోగా దినంగా ప్రతిపాదించారు.

ఈ విధంగా జూన్ 21 2015 నుండి వరుసగా ప్రతి సంవత్సరం జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినంగా జరుపుకుంటున్నాము. ఈకార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు టి.వెంకన్న, వై.సురేందర్, ఏ. వి.ల్ కల్యాణీ, జి.అనిల్ కుమార్, ఎం.రాజు, బి.కుమారస్వామి, కె.ప్రవీణ్, పి.లలిత, డి.పద్మ, జి.విజయభాస్కర్, శ్రీకల, అటెండర్, సాంబయ్య, విద్యార్థినీ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

 

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More