బాపూజీ ఆశయాలను సాదించుకుందాం : పద్మశాలి యువజన సంఘం

Let's achieve Bapuji's ambitions : Padmasali Youth Association

(చట్టం న్యూస్ /ఆసిఫ్ /కామారెడ్డి) : ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి ఉత్సవాల సందర్భంగా పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు జరుపుకున్నారు అనంతరం యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఐరేని సందీప్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిది.

1969లో తొలి దశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి, మంత్రి పదవిని కూడా త్వజించిన త్యాగశీలి, స్వాతంత్ర పోరాటం, నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం, ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించి దేశసేవకు అంకితమైన వ్యక్తి కొండాలక్ష్మణ్‌ బాపూజీ. దశాబ్దాల తెలంగాణ కల సాకారమైన వేల ఆ స్వప్నాన్ని మాత్రం ఆయన చూడలేక పోయారు.

ఉద్యమాలతోపాటు ప్రజాప్రతినిధిగా నిరంతరం ప్రజాసేవ కోసం తపించారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వాంకిడిలో 1915 సెప్టెంబరు 27న జన్మించిన కొండా లక్ష్మణ్‌ న్యాయవాద విద్యను అభ్యసించారు అని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఐరేని సందీప్ కుమార్, ఉపాధ్యక్షులు పొలాస సురేష్, ప్రతాప్ ,భాను,అల్వల సతీష్ తదితరులు పాల్గొన్నారు.

 

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More