MLAను కలిసిన మామిడిపల్లి మున్నూరు కాపు సంఘ సభ్యులు

Mamidipalli Munnuru Kapu Sangha members who met the MLA

(చట్టం న్యూస్ /పింజ సుదర్శన్ /ఆర్మూర్) : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లికి చెందిన మున్నూరు కాపు సంఘ సభ్యులు ఆర్మూర్ ఎమ్మెల్యే, పియుసి చైర్మన్, నిజామాబాద్ జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు ఆశన్న గారి జీవన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. మున్సిపల్ పరిధిలోని 24వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల రాము, కాశీరాంల అధ్యక్షతన మామిడిపల్లి మున్నూరు కాపు సంఘ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి వారి కుల సంఘానికి నిధులు కేటాయించాలని కోరగా ఎమ్మెల్యే తక్షణమే స్పందించి వారి కుల సంఘానికి రెండు ఎకరాల స్థలం, 50 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయిస్తానన్నట్లు చెప్పారు.

రెండు ఎకరాల స్థలంలో కళ్యాణ మండపం నిర్మాణం చేసుకోవాలని దానికి కావాల్సిన నిధులను 50 లక్షల రూపాయలను మంజూరు చేస్తానని వారికి హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సంఘ సభ్యులు పట్టు శాలువా, పూలదండలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు వారు ఇచ్చిన హామీకి రెండు ఎకరాల స్థలం, 50 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆకుల రాము, కాశీరాం, మామిడిపల్లి మున్నూరు కాపుసంఘ సభ్యులు పాల్గొన్నారు.

 

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More