చెట్లు పెంచడం తో స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది

Pure oxygen is obtained by growing trees

నిజామాబాద్ (చట్టం) : ప్రతి ఒక్కరూ తన ఇంటి ఆవరణలో, ఖాళీ స్థలంలో మొక్కలు నాటి పెంచాలని తద్వారా ఇంటిల్లిపాదికి స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుందని రోటరీ క్లబ్ నిజామాబాద్ అధ్యక్షులు దర్శన్ సింగ్స్ సోకే తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శనివారం నగరంలోని గంగస్తన్ లో గల సాయిలీల అపార్ట్‌మెంట్‌ నందు మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా దర్శన్ సింగ్ సోకే మాట్లాడుతూ నేడు మనం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఆక్సిజన్ ఒకటి అని దీనికి పరిష్కారం మొక్కలు నాటడం, ప్రతి పౌరుడు తన బాధ్యతగా స్వీకరించి మొక్కలు నాటి రానున్న సమాజానికి చక్కటి వాతావరణం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి బాబురావు, మాజీ అధ్యక్షులు రాజ్ కుమార్ సుబేదార్, శ్రీనివాస రావు, దన్ పాల్ శ్రీనివాస్, శ్యామ్‌ అగర్వాల్‌, అపార్ట్‌మెంట్‌ అధ్యక్షులు నాగనాథ్, కార్యదర్శి రహీం తదితరులు పాల్గొన్నారు.

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More