ఆ ‌ప్లేస్‌లో స్క్రూ‌‌డ్రైవర్‌తో పొడిచి.. బండరాయితో మోది.. జంట హత్యలు

Stabbed with a screwdriver in that place .. hit with a rock .. twin murders

  • వివాహేతర సంబంధమే  కారణం!
  • మేడే రోజున హైదరాబాద్‌ శివారులోఘటన

హైదరాబాద్‌ (‌చట్టం) : వివాహిత అక్రమ సంబందం ఇద్దరి ప్రాణాల మీదకు, రెండు కుటుంబాల్లో విషాదం నింపడానికి కారణమైంది. వివాహం జరిగి ఇద్దరు పిల్లలు ఉన్న వివాహిత అక్రమ సంబందం పెట్టుకోవడమే దీనికి కారణమని సమాచారం. వారిద్దరూ నగర శివారు ప్రాంతానికి వెళ్లి ఏకాంతంగా గడుపుతున్న సమయంలో.. వారిని అనుసరించిన మహిళా భర్త మరికొందరితో కలిసి ఇద్దరినీ దారుణంగా హత్య చేసినట్లు తెలుస్తోంది.

రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అబ్ధుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో విజయవాడ జాతీయ రహదారి పక్కన కొత్తగూడ బ్రిడ్జి సమీపంలో మేడే నాడు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సికింద్రాబాద్‌ వారాసిగూడలోని బౌద్ధనగర్‌కు చెందిన ఎడ్ల యశ్వంత్‌ (22) క్యాబ్‌ డ్రైవర్‌. అదే ప్రాంతానికి చెందిన జ్యోతి (30) తన, భర్త ఇద్దరు పిల్లలతో కలిసి ఉండేది. కొంతకాలం క్రితం వీరిద్దరి మద్య వివాహేతర సంబంధం ఏర్పడిందని.. అప్పుడప్పుడు ఇద్దరూ కలిసి అలా బయటకి వెళ్లి కలుసుకునేవారని సమాచారం. అదే క్రమంలో గత ఆదివారం (మే 1న) ఇద్దరూ బయటకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

ఆరోజు సాయంత్రం యశ్వంత్‌ తన సోదరుడి బండి తీసుకున్నాడు. యశ్వంత్‌, జ్యోతి కలిసి.. టార్చ్‌లైట్‌, చాప, వాటర్‌ బాటిల్‌, ‌స్ప్రైట్‌, ఫోన్‌ చార్జర్‌, ప్లాస్టిక్‌ పూలు తీసుకుని, ఆ బండిపై నగర శివార్లలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. హైవే దిగి.. బ్రిడ్జి కిందిభాగం గుండా చెట్లపొదల్లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడ ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు వారిపై దాడిచేశారు. జ్యోతి తల, ముఖంపై బండరాయితో మోది.. యశ్వంత్‌ తల, ఛాతీపై కొట్టడంతో పాటు, అతడి మర్మాంగంపై స్క్రూ‌ డ్రైవర్‌తో దారుణంగా పొడిచి చిత్రవధ చేసి హత్య చేశారు.

జాతీయ రహదారి వెంట ఉన్న బ్రిడ్జి పక్కన రెండు రోజులుగా ఒక స్కూటీ పార్కు చేసి ఉండటం, దాన్ని ఎవరూ తీసుకెళ్లకపోవడంతో.. ఆ ప్రాంతానికి చెందిన ఒక గీత కార్మికుడికి అనుమానం వచ్చింది. అతడు చట్టుపక్కల అంతా పరిశీలించగా ఒకచోట బాగా దుర్వాసన వచ్చింది. దగ్గరికి వెళ్లి చూడగా.. చెట్ల పొదల మధ్య నగ్నంగా కుళ్లిపోయిన స్థితిలో రెండు మృతదేహాలు కనిపించాయి. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కాగా.. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమై ఉండొచ్చని.. మృతురాలి భర్త వారిద్దరి మధ్య ఉన్న సంబంధాన్ని పసిగట్టి, మరికొంతమందితో కలిసి ఈ హత్య చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Comments are closed.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More